విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌! | Buzz: Shraddha Kapoor Star Alongside with Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతికి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

Mar 5 2026 7:23 AM | Updated on Mar 5 2026 8:41 AM

Buzz: Shraddha Kapoor Star Alongside with Vijay Sethupathi

చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్‌ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్‌ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

బాలీవుడ్‌ బ్యూటీ
విడాముయుర్చి ఫేమ్‌ మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్‌ సేతుపతికి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement