మార్చి నుంచి జూన్‌కి...  | Toxic Movie Release Date Postponed To 4 June 2026 | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి జూన్‌కి... 

Mar 5 2026 5:52 AM | Updated on Mar 5 2026 5:52 AM

Toxic Movie Release Date Postponed To 4 June 2026

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’.   వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్‌ హక్కులను ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్నారు. 

ఈ నెల 19న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ తొలుత ప్రకటించింది.. అయితే పోస్ట్‌పోన్‌ చేసి, జూన్‌ 4న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్‌. ‘‘మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలనుకున్నాం. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్‌ ఫిల్మ్స్‌ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. గల్ఫ్‌ ్రపాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement