'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా | Toxic Movie Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Toxic Release Date: యుద్ధం ఎఫెక్ట్.. 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్

Mar 4 2026 10:20 AM | Updated on Mar 4 2026 10:27 AM

Toxic Movie Release Date Latest Update

ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్‌నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.

'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?)

Advertisement
 
Advertisement
Advertisement