టాక్సిక్‌ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల.. నిరాశపరిచిన యశ్‌ | Yash and Kiara Advani Tabaahi song out from Toxic | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల.. నిరాశపరిచిన యశ్‌

Mar 2 2026 1:43 PM | Updated on Mar 2 2026 2:09 PM

Yash and Kiara Advani Tabaahi song out from Toxic

కన్నడ నటుడు యశ్  హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. యశ్‌, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను   విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్న విషయం తెలిసిందే.

టాక్సిక్‌ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఈ పాట మొదటిసారి వినగానే బాగుంది. కానీ, మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి  రొమాంటిక్ సాంగ్‌ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్‌తో సాంగ్‌ను విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్‌, విజువల్స్‌ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో ఇది అభిమానులను మరింత నిరాశపరచవచ్చు.  ఈ సినిమా మార్చి 19న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement