హిట్‌ సినిమా దర్శకుడిపై నటి ఫిర్యాదు | Malayalam Actress Complaint To Manjummel Boys director Chidambaram | Sakshi
Sakshi News home page

హిట్‌ సినిమా దర్శకుడిపై నటి ఫిర్యాదు

Mar 2 2026 1:26 PM | Updated on Mar 2 2026 1:33 PM

Malayalam Actress Complaint To Manjummel Boys director Chidambaram

మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్‌ దర్శకుడు చిదంబరం వివాదంలో చిక్కుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. 2022లో కొచ్చి నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్ తనతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. శ్రీ చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75 (లైంగిక వేధింపుల నేరాలు) కింద అభియోగాలు మోపారు.

2024లో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా చిదంబరం విపరీతమైన గుర్తింపు పొందారు. ఈ మూవీతో సినీ రంగంలో ప్రముఖ యువ దర్శకులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు.  2021లో ‘జాన్‌.ఈ.మ్యాన్‌’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement