'ఉ‍స్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు? | Thaman Works Ustaad Bhagat Singh Movie And Release Date Preponed | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్'.. ఊహించని ఛేంజెస్!

Mar 4 2026 3:05 PM | Updated on Mar 4 2026 3:10 PM

Thaman Works Ustaad Bhagat Singh Movie And Release Date Preponed

టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే  సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)

'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

Advertisement
 
Advertisement
Advertisement