Godari Gattupaina Movie
-
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
‘గోదారి గట్టుపైన’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: గోదారి గట్టుపైననటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ పొడ్రక్షన్స్నిర్మాత : అభినవ్ రావురచన-దర్శకత్వం : సుభాష్ చంద్రసంగీతం: నాగ వంశీకృష్ణవిడుదల తేది: మే 8, 2026‘మేమ్ ఫేమస్’తో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సుమంత్ ప్రభాస్..పేరుకి తగ్గట్టే తొలి సినిమాతోనే ఫేమస్ అయిపోయాడు. అయితే ఆ వెంటనే రెండో సినిమా చేయకుండా..దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గోదారి గట్టుపైన’ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 8) విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే శ్యాంబాబు(జగపతి బాబు)కి కూతురు మాయ(నిధి ప్రదీప్) అంటే ప్రాణం. తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తితో పెళ్లి చేస్తే.. కూతురు సుఖంగా బతుకుతుందని అనుకుంటాడు. కానీ మాయ మాత్రం ఆటో డ్రైవర్ రాజు(సుమంత్ ప్రభాస్)తో ప్రేమలో పడిపోతుంది. తన కూతురు ఓ ఆటో డ్రైవర్ని ప్రేమించిందని తెలిసిన తర్వాత శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమను అంగీకరించాడా? లేదా? ఆటో డ్రైవర్ రాజుకి, ఇంజనీరింగ్ చదివే మాయ ఎలా పడిపోయింది? రాజు పోలీసు స్టేషన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మాయ వాళ్ల నాన్నకు తాను అంటే ఇష్టం లేదని తెలిసిన తర్వాత రాజు ఏం చేశాడు? చివరకు మాయ, రాజు ఎలా ఒక్కటయ్యారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రాణంగా చూసుకునే కూతురు తనకంటే తక్కువ స్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం.. ఇది తండ్రికి నచ్చకపోవడం.. కూతురుకి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేయడం.. చిన్న ట్విస్ట్.. క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం.. ఇలాంటి నేపథ్యంతో తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ‘గోదారి గట్టుపైన’ మూవీ నేపథ్యం కూడా ఇదే. టైటిల్ తగ్గట్టే పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. తండ్రి కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్న అమ్మాయి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేమకు కుల మతాలు అడ్డురావన్న సందేశంతో పాటు పిల్లలు తమ జీవితంలో ఏం జరిగినా.. పెరెంట్స్‌కు చెప్పగలిగేలా పెంపకం ఉండాలని సలహా ఇచ్చే చిత్రమిది. కథ మాదిరే కథనం కూడా రొటీన్‌గా, ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా ఉండడం మైనస్. అలాగే హీరో హీరోయిన్లు ప్రేమలో పడడానికి, విడిపోవడానికి గల కారణాలు కూడా బలంగా లేకపోవడం సినిమా ఆసక్తిని తగ్గిస్తాయి.ఓ పందెం పోటీతో హీరోని ఆటో డ్రైవర్‌గా పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత అతని ఫ్యామిలీ నేపథ్యాన్ని, స్నేహితుల పాత్రలను పరిచయం చేస్తూ మెల్లిగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. మాయ, రాజుల పరిచయ సన్నివేశాలు బాగానే ఉన్నా.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో పడడానికి గల కారణంగా ఇంకాస్త బలంగా చూపించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. నాన్నకు నచ్చడు అనే కారణంతో రాజుని మాయ దూరం పెట్టడం.. మళ్లీ దగ్గరవ్వడం.. ఈ విషయం శ్యాంబాబు తెలిసిన తర్వాత ఏం చేశాడనేది సెకండాఫ్ స్టోరీ. అయితే ద్వితియార్థంలో కథనం కొంతవరకు సాగదీతగా అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. రాజు ఫ్యామిలీ ప్లాష్ బ్యాక్, పెళ్లి ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..ఆటోడ్రైవర్ రాజు పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. తెరపై చాలా హుషారుగా కనిపిస్తూ.. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. గోదారి యాస బాగానే మ్యానేజ్ చేశాడు. ఇక నిధి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. నాన్న గారాల పట్టి మాయ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక మహాలక్ష్మి పాత్రలో కనిపించిన రీనూ అందంతో ఆకర్షించింది. గబగబా మాట్లాడుతూ అందరిని నవ్విస్తుంది. శ్యాంబాబుగా జగపతి బాబు, అతని భార్యగా లైలా నటించారు. ఈ జోడీని సరిగా వాడుకోవడంతో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. లైలా పాత్రకు పెద్ద ప్రాధాన్యతే లేదు. సుదర్శన్ కామెడీ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నాగ వంశీకృష్ణ అందించిన పాటలు బాగున్నాయి. బీజీఎం కొన్ని చోట్ల పాత సినిమాలను గుర్తు చేసినా.. ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కోనసీమ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాది తెలంగాణ.. గోదారి నేపథ్యం సవాల్‌గా అనిపించింది
‘‘మేమ్ ఫేమస్’ మూవీతో యూత్‌లో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అయితే ‘గోదారి గట్టుపైన’ పూర్తి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాలోని వినోదం, భావోద్వేగాలు, రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఆక ట్టుకుంటాయి. ‘మేమ్ ఫేమస్’తో యూత్‌కి దగ్గరైన నేను ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతానని సంతోషంగా ఉంది’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలిపారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌పై అభినవ్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సుభాష్‌గారు ఇప్పటికే వంద షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన చెప్పిన ‘గోదారి గట్టుపైన’ కథ నాకు బాగా నచ్చింది. గోదారి నేపథ్యంలో కథ అనగానే నాకు సవాల్‌గా అనిపించింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. ఈ మూవీలో ఆటో డ్రైవర్‌గా చేశాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర నాది. జగపతిబాబుగారిది మెయిన్ క్యారెక్టర్. ‘శుభలగ్నం, ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్లో ఆయన కనిపిస్తారు. దేవీ ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర చేశారు. ఈ మూవీలోని లవ్, ఫాదర్–డాటర్ ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. నేను వదులుకున్న సినిమాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఒకటి. నా తొలి చిత్రం ‘మేమ్ ఫేమస్’కి ట్వీట్ చేసి, మహేశ్‌బాబు గారు సపోర్ట్ చేయడం హ్యాపీగా అనిపించింది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా పూర్తయింది. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను’’ అని చెప్పారు. -
'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?
చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్‌తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి) -
భావోద్వేగాలు మెప్పిస్తాయి: నిర్మాత అభినవ్
‘‘నేను పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నప్పటికీ సినిమాఅంటే ప్యాషన్ . యూనివర్సల్ సబ్జెక్ట్‌తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేయాలనుకున్నాను. అలాంటి కథ ‘గోదారి గట్టుపైన..’తో కుదిరింది. ఈ సినిమా కోసం సుమంత్ గోదారి యాస నేర్చుకుని నటించాడు. జగపతిబాబు–నిధిగార్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అని నిర్మాత అభినవ్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ–‘‘దర్శకుడు సుభాష్‌కు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ కథలో ఎమోషన్ , కామెడీ, డ్రామా అన్నీ కుదిరాయి. నిర్మాత సునీల్‌గారు నాకు మార్గదర్శి. నా తొలి సినిమాలోనే జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాలగార్ల వంటి నటీనటులు ఉన్నారంటే ఇందుకు కారణం ఆయనే. నాగవంశీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఏపీలో సురేశ్ బాబుగారు, నైజాంలో నేను–సునీల్‌గారు, సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్‌గారు రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రం కూడా సుభాష్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని చెప్పారు. -
తరాలు మారినా భావోద్వేగాలు మారవు : సుభాష్ చంద్ర
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో నటించిన సినిమా ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సుభాష్ చంద్ర మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ చదువుతున్నప్పట్నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఎక్కువగా రాజ్ తరుణ్‌తో చేశాను. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్‌కి ప్రయత్నాలు ఆరంభించాను. ఒక సినిమా సెట్స్‌కు వెళ్లే ముందు ఆగిపోయింది. మరో సినిమా షూటింగ్ పూర్తయింది కానీ రిలీజ్ కాలేదు. ఫైనల్‌గా ‘గోదారి గట్టుపైన..’ సినిమాతో దర్శకుడిగా వస్తున్నాను. ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. తరాలు మారినా భావోద్వేగాలు మారవని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమా కథ మన జీవితాల్లో మనం చూసినదే. తండ్రీకూతుళ్ల ప్రేమ, ఇద్దరు ప్రేమికుల ప్రేమ... ఈ రెండు అంశాలను ట్రయాంగిల్ ఫార్మ్‌లో చూపించే ప్రయత్నం చేశాం. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి తండ్రి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇది తండ్రి ప్రేమ. ఇటు అబ్బాయి ప్రేమలోనూ నిజం ఉంటుంది. ఈ అంశాలను పరిణతితో కూడిన ఆలోచనలతో చూపించాం. తెలంగాణ అబ్బాయి సుమంత్ ఈ సినిమా కోసం గోదావరి యాస సాధన చేశాడు. హీరోయిన్ నిధి కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు. నాగవంశీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా తర్వాతి సినిమా ఈ బ్యానర్లోనే ఉంటుంది. అలాగే హారర్–థ్రిల్లర్ జానర్లో ఓ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
నోరు జారి.. డ్రాగన్ అప్డేట్ లీక్ చేసిన రాజీవ్ కనకాల
-
అలరించేలా 'గోదారి గట్టుపైన' ట్రైలర్
కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' టీజర్ రిలీజ్
ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'గోదారి గట్టుపైన' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు వెల్లడించలేదు కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఓ క్యూట్ ప్రేమకథ ఇదని తెలుస్తోంది. దీనికి తోడు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో చేసే కామెడీ ఉండనే ఉందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లు కాగా సుదర్శన్, రాజ్ కసిరెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నారు. బహుశా వేసవిలో థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో సినిమా దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)


