‘‘నేను పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నప్పటికీ సినిమాఅంటే ప్యాషన్ . యూనివర్సల్ సబ్జెక్ట్‌తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేయాలనుకున్నాను. అలాంటి కథ ‘గోదారి గట్టుపైన..’తో కుదిరింది. ఈ సినిమా కోసం సుమంత్ గోదారి యాస నేర్చుకుని నటించాడు. జగపతిబాబు–నిధిగార్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అని నిర్మాత అభినవ్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ–‘‘దర్శకుడు సుభాష్‌కు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ కథలో ఎమోషన్ , కామెడీ, డ్రామా అన్నీ కుదిరాయి. నిర్మాత సునీల్‌గారు నాకు మార్గదర్శి. నా తొలి సినిమాలోనే జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాలగార్ల వంటి నటీనటులు ఉన్నారంటే ఇందుకు కారణం ఆయనే. నాగవంశీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఏపీలో సురేశ్ బాబుగారు, నైజాంలో నేను–సునీల్‌గారు, సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్‌గారు రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రం కూడా సుభాష్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని చెప్పారు.


