ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి హోరో హోరీగా సాగుతోంది. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ సోమవారం పార్టీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా బలమైన తీర్పును ప్రజల మద్దతు ప్రతిబింబిస్తోందని శర్మ అన్నారు.
"బీజేపీకి, ప్రధాని మోడీకి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, మద్దతును బట్టి అస్సాం, పశ్చిమ బెంగాల్,పుదుచ్చేరిలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం స్పష్టమవుతోంది. తమిళనాడు, కేరళలో కూడా ఓట్ల వాటా గణనీయంగా పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నా మన్నారు. ఆయన ఏఎన్ఐకి తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ప్రకారం, పుదుచ్చేరి తొలి ట్రెండ్స్ ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) చెరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
భారత ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, పుదుచ్చేరిలో ఉదయం 9.15 గంటల సమయానికి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 30 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ రెండు స్థానాల్లో పోటికీ నిలబడింది.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల రంగస్వామి మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతుండటం విశేషం.
పుదుచ్చేరి ట్రెండ్స్
ప్రారంభ గణాంకాల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు 16. ఇది 2021లో NDA ప్రభుత్వం ఏర్పాటుకు సాధించిన సంఖ్యకు సమానం. అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈ తొలి ట్రెండ్ వెలువడింది. తదుపరి దశల్లో మరింత స్పష్టమైన చిత్రం వెలువడే అవకాశం ఉంది.


