అలరించేలా 'గోదారి గట్టుపైన' ‍ట్రైలర్ | Godari Gattupaina Movie Trailer | Sakshi
Sakshi News home page

Trailer: తండ్రి కూతురి ఎమోషన్‌తో మరో తెలుగు సినిమా

Apr 27 2026 6:18 PM | Updated on Apr 27 2026 6:20 PM

Godari Gattupaina Movie Trailer

కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ ‍అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)

షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement