హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.
'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)


