ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu April Last Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 16 మూవీస్.. మరి థియేటర్లలో?

Apr 27 2026 12:22 PM | Updated on Apr 27 2026 12:47 PM

Upcoming OTT Movies Telugu April Last Week 2026

మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.

(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)

మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్‌తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్‌ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ‍ఏప్రిల్ 29

  • మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30

  • బైకర్ (తెలుగు మూవీ) - మే 01

  • రాకాస (తెలుగు సినిమా) - మే 01

  • గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01

హాట్‌స్టార్

  • బ్యాచ్‌మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30

అమెజాన్ ప్రైమ్

  • ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29

  • సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01

  • లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)

జీ5

  • లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27

  • ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01

  • ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01

  • డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01

సోనీ లివ్

  • ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01

ఆపిల్ టీవీ ప్లస్

  • విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29

(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement