ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్ | Ahead Of Birthday Samantha Reveals Interesting Facts | Sakshi
Sakshi News home page

Samantha: పుట్టినరోజుకి ముందు సమంత సంచలన పోస్ట్

Apr 26 2026 8:31 PM | Updated on Apr 26 2026 8:31 PM

Ahead Of Birthday Samantha Reveals Interesting Facts

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.

(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)

పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష‍్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.

(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)

Advertisement
 
Advertisement
Advertisement