బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.
(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)
'2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం'
'నేను వైజాగ్‌లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష‍్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?)


