సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు? | Rukmini Vasanth Consider MS Subbulakshmi Biopic Instead Sai Pallavi | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: ఇంట్రెస్టింగ్ బయోపిక్ నుంచి సాయిపల్లవి తప్పుకొందా?

Apr 26 2026 5:57 PM | Updated on Apr 26 2026 6:02 PM

Rukmini Vasanth Consider MS Subbulakshmi Biopic Instead Sai Pallavi

ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ పరంగా కొందరు హీరోయిన్లు టాప్‌లో ఉన్నారు. వాళ్లలో సాయిపల్లవి, రుక్మిణి వసంత్ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రామాయణ, కల్కి 2 లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీస్‌తో సాయిపల్లవి.. ఎన్టీఆన్ 'డ్రాగన్'తో రుక్మిణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇ‍ప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)

ఎన్నో వందల పాటలతో దిగ్గజ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్ తీసేందుకు అంతా సిద్ధమైంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి.. ఈ క్రేజీ బయోపిక్‌కి దర్శకుడు కాగా సుబ్బలక్ష‍్మి పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి రుక్మిణి పేరు తెరపైకి వచ్చింది. పలు సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా సాయిపల్లవి, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందని అంటున్నారు.

మరికొందరేమో సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లో సాయిపల్లవి ఇంకా ఉందని, రుక్మిణి అంటూ వస్తున్నవి రూమర్స్ మాత్రమేనని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటనేది దర్శకనిర్మాతే క్లారిటీ ఇవ్వాలి.

(ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)

Advertisement
 
Advertisement
Advertisement