breaking news
Rukmini Vasanth
-
రుక్మిణి 'కాంతార 1' జ్ఞాపకాలు.. 'లిటిల్ హార్ట్స్' శివానీ ఇలా
'కాంతార 1' షూటింగ్ జ్ఞాపకాలతో రుక్మిణి వసంత్'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ గ్లామరస్ పోజులువర్కౌట్ చేస్తూ పెట్ డాగ్‌తో కీర్తి సురేశ్ సరదాజిమ్ ఫొటో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ సమంతఅందాల హరివిల్లులా జాన్వీ కపూర్ స్టిల్స్జిమ్ వీడియో పోస్ట్ చేసిన నభా నటేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
'కాంతార 1' కోసం రుక్మిణి ఇంత కష్టపడిందా?
-
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1'
ఈ నెల ప్రారంభంలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'కాంతార 1'. ఇదొచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రాలేదు. దీంతో పలు భాషల్లో ఇప్పటికీ బాగానే ప్రదర్శితమవుతోంది. రెండు మూడు రోజుల క్రితం రూ.800 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రూ.1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీ గురించి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)2022లో రిలీజైన మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా.. ఈ సినిమా కూడా దీనిలోనే రానుందని సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 'లెజెండ్ కంటిన్యూస్' అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిబట్టి చూస్తే 'కాంతార ఛాప్టర్ 1' కూడా వేగంగానే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. అభిమానులు మాత్రం థియేటర్లలో ఉండగానే వచ్చేయడమేంటి? ఇంకొన్నిరోజులు ఆగి వస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ వీకెండ్లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని.. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుందో?(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ లిస్ట్)...to become LEGENDARY 🔥 pic.twitter.com/xRh6zFJkS1— prime video IN (@PrimeVideoIN) October 26, 2025 -
'ఓజీ' బ్యూటీ దుబాయి ట్రిప్.. అందమైన రుక్మిణి
దుబాయి ట్రిప్ వేసిన 'ఓజీ' బ్యూటీ ప్రియాంకచీరలో అందంగా కనిపిస్తున్న రుక్మిణి వసంత్గ్లామరస్ లుక్‌లో కె ర్యాంప్ హీరోయిన్ యుక్తికలరిపయట్టు ప్రాక్టీసులో 'సలార్' శ్రియారెడ్డిఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు.. రెజీనా ఎమోషనల్బ్లాక్ శారీలో పద్ధతిగా హీరోయిన్ శ్రుతి హాసన్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్
-
'కాంతార' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ విడుదల
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1). అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 720 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియ భామిని అనే సాంగ్‌ను విడుదల చేశారు. రిషబ్, రుక్మిణి వసంత్ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద ఆలపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు. కాంతార ఛాప్టర్-1 విజయవంతమైన తర్వాత రిషబ్ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు. దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్ట్‌లో ‘కాంతార -1’ రెండో స్థానంలో ఉంది. రూ.1200 కోట్ల కలెక్షన్లతో ‘కేజీయఫ్ 2’ తొలి స్థానంలో నిలిచింది. -
‘కాంతార చాప్టర్ 1’ దీపావళి బ్లాస్ట్.. కొత్త ట్రైలర్ అదిరింది!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికీ అత్యధిక థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు. యాక్షన్ సీన్లను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
కాంతార ‘కనకావతి’ శారీ లుక్ అదరహో! (ఫొటోలు)
-
'కాంతార 1'లో ఇంత పొరపాటు ఎలా చేశారు?
ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకులు దీనికి భయపడి ఏళ్లపాటు సినిమాని ఫెర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు 'కాంతార 1'లో చాలా పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఆ సంగతి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.2022లో వచ్చిన 'కాంతార' సినిమాని ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1'ని మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే అడవిలో సెట్ వర్క్ గానీ, పాత్రధారుల కాస్ట్యూమ్స్ గానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించారు. కానీ ఒక్కచోట మాత్రం మూవీ టీమ్ దొరికిపోయింది. అందరూ దీన్ని కనిపెట్టకపోవచ్చు గానీ కొందరు నెటిజన్లు మాత్రం తప్పుని పట్టేశారు.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)సెకండాఫ్‌లో 'బ్రహ్మకలశ' అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకొచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో కాంతార అలియాస్ రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి పూజలు చేయడం.. ఇలా అంతా చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని భోజన చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ కనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. అది ఇప్పుడు మూవీలో, రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో కనిపించింది.వీడియో సాంగ్‌లో సరిగ్గా 3:06 నిమిషాల ఈ పొరపాటుని మీరు గమనించొచ్చు. దీన్ని మరీ అంతలా ట్రోల్ చేయడం లేదు గానీ ఫన్నీగానే 16వ శతాబ్దంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్) -
అప్పటిరోజులు గుర్తుచేసిన కాజల్.. స్టైలిష్‌గా కల్యాణి
ఒకప్పటిలా అందంగా కనిపించిన కాజల్ అగర్వాల్స్టైలిష్ మోడ్రన్ లుక్‌లో కల్యాణి ప్రియదర్శన్సాయంతాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్న వైష్ణవిచీరకట్టులో నాభి అందాలతో నభా నటేశ్కలర్ఫుల్ డ్రస్సులో అమలాపాల్ వయ్యారాలుటంగ్ ట్విస్టర్తో నవ్వించిన రుక్మిణి వసంత్ View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గా విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్‌ను కూడా కాంతార చాప్టర్1 అధిగమించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్ రికార్డ్‌ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్ కలెక్షన్స్‌తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి. -
కాంతార-2 బ్లాక్ బస్టర్.. దూసుకుపోతున్న రుక్మిణి..
-
'కాంతార' సెట్స్‌లో రిషబ్‌శెట్టి సతీమణి ప్రగతి (ఫోటోలు)
-
'రుక్మిణీ వసంత్' తండ్రి వీరమరణం పొందారని తెలుసా?
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కూతురు అని కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్‌కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రదేశాల్లో ఆయన సేవలు అందించారు. అయితే, రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రుక్మిణీ జీవితంలో ఒక మలుపు. అందుకే ఆమె తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండేలా రుక్మిణీ వసంత్‌గా మార్చుకుంది.రుక్మిణీ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకుంటూ ఆయన వీరమరణం పొందారు. భారీ ఆయుధాలతో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ట్రక్ సాయంతో భారత్‌లోకి ప్రవేశించారు. దానిని గమనించిన వసంత్ టీమ్ వారిని అడ్డుకుంది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఎదుర్కొన్నారు. చొరబడిన ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చే వరకు ఆయన పోరాడారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా తూటాలు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చి అశోక చక్ర పతకంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రుక్మిణీ తండ్రి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో కఠణమైన శిక్షణ పొందారు. అందుకే 9 మరాఠా లైట్ త్రిదళంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. ఇలా ఆయన ఇండియన్ ఆర్మీలో చాలా కీలకంగా పనిచేశారు. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ "వీర్ రత్న ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించి యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన వంతుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు. -
'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.నేషనల్ క్రష్ గురించినేషనల్ క్రష్ ట్యాగ్‌లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు. -
'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.'కాంతార' విషయానికొస్తే.. మొదటి పార్ట్‌లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ. -
'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?) -
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
మూడేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా 'కాంతార'. తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేస్తే తెలుగు, హిందీలోనూ సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'కాంతార ఛాప్టర్ 1'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. రిషభ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు. ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పార్ట్‌కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది బాంగ్రా రాజ్యం. దీనికో రాజు. ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు(జయరామ్) బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటు వైపు వెళ్లే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి(రిషభ్ శెట్టి) అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు(గుల్షన్ దేవయ్య) కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి.. బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?2022లో వచ్చిన 'కాంతార'లో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే. చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగమంతా మెప్పించిందా? అంటే లేదు. తొలి పార్ట్‌తో దీనికి కచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది. కానీ నేటివిటీ మిస్ అయింది.తొలి పార్ట్‌లో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్లు, కాంతార అనే ప్రదేశం.. ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్టాప్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్‌పై అన్నీ జరుగతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరైనా సరే సింపుల్‌గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి. కచ్చితంగా తడబడతారు. అలా ఉంది! అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి.ఎవరెలా చేశారు?రిషభ్ శెట్టి నటన బాగానే ఉంది గానీ తొలి పార్ట్ కంటే డిఫరెన్స్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది. ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఈమె పాత్రని ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్‌కి అస్సలు మింగుడుపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య.. రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్. గుర్తుండవు అలానే అర్థం కావు కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషభ్ శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషభ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని కచ్చితంగా అనిపిస్తుంది.- చందు డొంకాన -
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఎల్లలు లేని ఆనందంలో రుక్మిణి
కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే మనసు ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుంది. నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు అలాంటి ఆనందంలో తేలిపోతున్నారు. 2019లో మాతృభాషలో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత హిందీలో అప్‌స్టార్ట్స్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ దిగుమతి అయిన ఈమె తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసీ చిత్రం విజయానందాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కన్నడంలో రిషబ్ శెట్టితో నటించిన కాంతార. చాప్టర్ 1 చిత్రం అక్టోబర్ 2న పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి రానుంది. దీనితో పాటూ యష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్‌తో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో రుక్మిణి వసంత్ పేర్కొంటూ తనను నటిగా అంగీకరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. కాంతార చాప్టర్ 1 తనకు చాలా ముఖ్యమైన చిత్రం అన్నారు. తన నటనను చూసిన రిషబ్ శెట్టి అద్భుతం అన్న అభినందనను జీవితంలో మరిచిపోలేనన్నారు. అదే విధంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తన మనసు ఎల్లలు లేని ఆనందంలో మునిగితేలుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నానని నటి రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడి కెరీర్ మంచి జోష్‌లో సాగుతోందన్నమాట. -
107 మిలియన్ వ్యూస్.. ‘కాంతార: చాప్టర్ 1’ ఖాతాలో సరికొత్త రికార్డు!
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్లో శివకార్తికేయన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.𝟏𝟎𝟕𝐌+ 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟑.𝟒𝐌+ 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬…🔥The Trailer of #KantaraChapter1 takes the internet by storm, igniting massive excitement everywhere.Watch #KantaraChapter1Trailer now – https://t.co/YVnJsmn7VxIn cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara… pic.twitter.com/WyjLETiGsX— Hombale Films (@hombalefilms) September 23, 2025 -
'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి
కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్‌పైన స్పందించాడు.'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్‌కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్‌తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్‌తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)"#KantaraChapter1: We haven't slept properly for 3 months because of continuous work🫡👏. Everyone supported it as like their own film♥️. In fact, if I count, I was about to die 4 or 5 times during shoot, the divinity we trust saved me🛐♥️"- #RishabShetty pic.twitter.com/8pufSUj7ZI— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025"#KantaraChapter1: I got shocked when I saw no smoking, no alcohol, and no meat Poster😳. In fact I cross checked with the production too🤝. Someone has fakely posted it to get popularity, we don't even want to react for that fake poster❌"- #RishabShettypic.twitter.com/I89jj7y7GP— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025 -
'కాంతార' ట్రైలర్ రిలీజ్.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
'ఆ ప్రాజెక్ట్ వల్లే ఐదేళ్ల గ్యాప్'.. మదరాసి డైరెక్టర్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం మదరాసి. ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.. సెప్టెంబర్ 5న మదరాసి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథలో హీరో పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్‌కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారుని మురుగదాస్ వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని పేర్కొన్నారు.అయితే గత ఐదేళ్లలో నేనెప్పుడూ ఖాళీగా ఉండలేదని ఏఆర్ మురుగదాస్ తెలిపారు. కానీ మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేసినట్లు వెల్లడించారు. దాని వల్లే చాలా సమయం వృథా అయిందని.. అందువల్లే ఐదేళ్ల గ్యాప్ వచ్చిందన్నారు. -
ఇంటర్ నేషనల్ డ్రాగన్
‘డ్రాగన్’ రేంజ్ గ్లోబల్ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లోప్రారంభం అవుతుందని, ఈ దిశగా చిత్రయూనిట్ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతేకాదు... తన గత చిత్రాలు ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ప్రాంతాలు ఉన్నట్లే ‘డ్రాగన్’ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట ప్రశాంత్ నీల్. ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్, ఖాన్సార్’ల ప్రస్తావన ఇండియా వైడ్‌గా ఉంటే, ‘డ్రాగన్’ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ సృష్టిస్తున్న ప్రపంచానికి ఇంటర్ నేషనల్ టచ్ ఉంటుందట. ఇందుకోసమే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందని భోగట్టా. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. -
అనన్య హెయిర్ స్టైల్.. ఆషిక పరమ్ సుందరి వైబ్
డార్క్ చాక్లెట్‌తో అనన్య గ్లామరస్ రీల్ఓనం సెలబ్రేషన్స్‌లో కల్యాణి ప్రియదర్శన్బెడ్పై వయ్యారాలు పోతున్న రీతూ వర్మకలర్ఫుల్ అషూరెడ్డి అందాల విందుఊటీ వెకేషన్లో తమిళ బ్యూటీ దుసారాఆగస్టు జ్ఞాపకాలు పంచుకున్న రుక్మిణి వసంత్ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
అందుకే తెలుగు సినిమాలకు రూ. 1000 కోట్లు వస్తున్నాయి : శివ కార్తికేయన్
‘‘నా సినిమాలు ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’, ‘మహావీరుడు’, ‘అమరన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మదరాసి’(Madharaasi ) సినిమాను కూడా ఆదరించాలి. విజయం కంటే మీరు (ప్రేక్షకులు) చూపించే ప్రేమే నాకు చాలా ప్రత్యేకం’’ అని శివ కార్తికేయన్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ , రుక్మిణీ వసంత్ జోడీగా నటించిన చిత్రం ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. (చదవండి: ఈ వ్యక్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్)హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కార్తికేయన్(Sivakarthikeyan) మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, మహేశ్బాబుగార్లను డైరెక్ట్ చేసిన మురుగదాస్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు మంచి కంటెంట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. నిర్మాతగా ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం.. అందుకే తెలుగులో తరచుగా వెయ్యికోట్ల కలెక్షన్స్ రాబడుతున్న చిత్రాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.(చదవండి: ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ) ‘‘మా సినిమా ఆరంభంలో రుక్మిణి అప్‌కమింగ్ హీరోయిన్ . కానీ, ఇప్పుడు ఎన్టీఆర్– ప్రశాంత్‌నీల్ సినిమా, యశ్ ‘టాక్సిక్’, రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ వంటి చిత్రాలు చేస్తున్నారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ‘‘మదరాసి’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రుక్మిణీ వసంత్. -
రుక్మిణి వసంత్.. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్?
రుక్మిణి వసంత్. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఈమె స్వతహాగా కన్నడ. కానీ 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీతో మనోళ్లకు కాస్త పరిచయం. అలాంటిది ఇప్పుడు 'మదరాశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది కాదు అసలు విషయం. ఈమె చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ లైనప్ చూస్తేనే మిగతా హీరోయిన్స్ అసూయ పడతారేమో అనిపిస్తుంది.శివకార్తికేయన్-మురుగదాస్ కాంబోలో తీసిన 'మదరాశి'లో రుక్మిణి వసంత్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఈమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది తెలీదు. బేసిగ్గా ఈ మూవీపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత ఎన్వీ ప్రసాద్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని బయటకు చెప్పేశారు. అలానే కాంతార సీక్వెల్, యష్ 'ట్యాక్సిక్'లోనూ ఈమెనే కథానాయిక అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్ప్రైజ్)ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హిట్స్ కొడుతూ వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ అంటే అందరికీ రష్మికనే గుర్తొస్తుంది. కానీ రుక్మిణి వసంత్ లైనప్ చూస్తుంటే రష్మికలానే ఈమె కూడా నెక్స్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో రాబోతున్న 'కాంతార' సీక్వెల్లో ఈమె యువరాణి పాత్ర చేసింది. అలానే వచ్చే ఏడాది మార్చిలో ట్యాక్సిక్, వేసవిలో నీల్-తారక్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇవన్నీ కచ్చితంగా హిట్ బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం రుక్మిణి.. మోస్ట్ వాంటెడ్ అయిపోవడం గ్యారంటీ.రీసెంట్గా మొదలైన వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్గా రుక్మిణి వసంత్‌ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు. కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తు.. రాబోయే 10 నెలల్లో ఏ మేరకు మారబోతుందో చూడాలి?(ఇదీ చదవండి: సూపర్‌స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?) -
‘మధరాసి’ సినిమా ప్రీ రిలీజ్ మెరిసిన హీరోయిన్ రుక్మిణీ వసంత్ (ఫొటోలు)
-
‘మధరాసి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ముట్టుకుంటే కందిపోయేలా తమన్నా.. రుక్మిణి స్మైల్!
ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా తమన్నానవ్వుతు మైమరిపించేస్తున్న రుక్మిణి వసంత్సొంతూరి చరిత్ర గురించి నభా నటేశ్ ఇన్ స్టా పోస్ట్మాల్దీవుల్లో భర్తతో కలిసి కాజల్ అగర్వాల్ చిల్SSMB29 ఆఫ్రికా షూటింగ్లో ప్రియాంక చోప్రా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్
-
శివ కార్తికేయన్ 'మదరాసి' ఆడియో వేడుక (ఫొటోలు)
-
'కాంతార'లో కనకావతి
వరమహాలక్ష్మి పండగ సందర్భంగా కనకావతిగా కనిపించారు రుక్ష్మిణి వసంత్. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో కనకావతి పాత్రలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటించినట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.హోంబలే ఫిలిమ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ (2022)కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ రూపొందిన సంగతి తెలిసిందే. -
మణిరత్నం దర్శకత్వంలో..?
అందమైన ప్రేమకథలకి చక్కని భావోద్వేగాలు జోడించి తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.ఈ కథకి ధ్రువ్, రుక్మిణి సరైన జోడీ అనే ఆలోచనతో వారిని ఎంపిక చేశారని టాక్. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారట మణిరత్నం. ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (2024) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్నారు. -
ఎన్టీఆర్ తర్వాత మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన రుక్మిణి
ఇతర భాషల్లో హిట్స్ అందుకుంటే వారికి కచ్చితంగా తమిళంలో అవకాశాలు వరిస్తాయి. అలా కోలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న కన్నడ నటి రుక్మిణి వసంత్. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో బీర్బల్ త్రిలోగీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత అప్‌స్టార్ట్స్ అనే హిందీ చిత్రంలో నటించారు. 2023లో నటించిన 'సప్త సాగరాలు దాటి' అనే చిత్రం రుక్మిణి వసంత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం పలు అవార్డులను సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్లోనూ నటించిన రుక్మిణి వసంత్‌కు తరువాత కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌కు జంటగా భైరతి రణంగళ్ అనే భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అలా అక్కడ స్టార్ హీరోయిగా పేరు తెచ్చుకున్న ఈ భామకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాలింగ్ వచ్చింది. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్‌కు జంటగా నటించారు. ఆ తరువాత కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ సేతుపతి సరసన ఏస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో మదరాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్‌కు తాజాగా ఒక తెలుగు, ఒక తమిళం చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నారు. ఇకపోతే తమిళంలో విక్రమ్‌తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల వీరధీరశూరన్ చిత్రంతో హిట్‌ను అందుకున్న విక్రమ్ తాజాగా తన 64వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి 96, మెయ్యళగన్ చిత్రాల ఫేమ్ ప్రేమ్‌కుమార్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్.. 'విజయ్ సేతుపతి' కొత్త సినిమా స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్‌ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
జోడీ కుదిరిందా?
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేశ్ నటించనున్న చిత్రం ఏంటి? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హీరో వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే ప్రచారం ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ వెంకటేశ్ తర్వాతి చిత్రం మాత్రం త్రివిక్రమ్‌తోనే అని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారంతా.అయితే తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి ఓకే చెప్పారు అల్లు అర్జున్. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఏడాది అయినా పడుతుంది. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్.. వెంకటేశ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారని టాక్. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నారని సమాచారం.హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా జూన్ 6న అధికారికంగా ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా రుక్ష్మిణీ వసంత్‌ని ఎంపిక చేశారట. నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(2024) సినిమాతో రుక్మిణీ వసంత్ తెలుగుకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. -
ACE X review: విజయ్ సేతుపతి ‘ఏస్’ మూవీ టాక్ ఎలా ఉందంటే..?
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏస్’(ACE). దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టాలీవుడ్లో కూడా విజయ్ సేతుపతి ప్రమోషన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు(ACE Review). (చదవండి: డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ భైరవం’)ఇలా ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ్నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఫస్డ్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘ఏస్’ సినిమా ఎలా ఉంది? విజయ్ సేతుపతి ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండిఎక్స్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. యావరేజ్ ఫిల్మ్ అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. What a delightful entertainer! #ACE is just what I was craving for. A pleasant, funny simple entertainer that has loads of action, romance and comedy! A film that truly makes you forget the pressures of life and relax for a good three hours. @VijaySethuOffl looks smart, having… pic.twitter.com/QVa4hM7TdK— Cineobserver (@cineobserver) May 22, 2025 ‘ఏస్’ ఓ కామెడీ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్విస్తుంది. యాక్షన్, రొమాన్స్ కూడా కూడా ఆకట్టుకుంటాయి. లైఫ్‌లో అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. విజయ్ సేతుపతి తెరపై చాలా స్మార్ట్‌గా కనిపించాడు. యాక్టింగ్ నీట్‌గా ఉంది. రుక్మిని వసంత్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. యోగిబాబు కామెడీ అదిరిపోయింది’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. #ACE [4/5] – A fun comedy-heist set in Malaysia!@VijaySethuOffl delivers both mass & class moments.@iyogibabu is in top form – his chemistry with VJS is a blast!@rukminitweets does her part well.@samcsmusic's BGM fits perfectly.@Aaru_Dir delivers a clever entertainer for… pic.twitter.com/BpBWTT3AvJ— CinemaNagaram (@CinemaNagaram) May 22, 2025 మలేషియాలో జరిగే దోపిడి ఆధారంగా నడిచే కామెడీ చిత్రమిది. విజయ్ సేతుపతి మాస్ క్లాస్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో కలిసి యోగి బాబు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. రుక్మిణి వసంత్ తన పాత్రకు న్యాయం చేసింది. సామ్ సీఎస్ బీజీఎం బాగుంది.అర్ముగ కుమార్ ఇంటెలిజెంట్ రైటింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.#ACE Vijay Sethupathi and Yogi Babu carried the movie entirely. It was funny and intelligent about how an unknown lands in Malaysia and pulls off a chaotic heist by misleading police and loan sharks. It has good chances to get a sequel.Rukmini was cute and so was their love story— Procrastinator (@BagaCoolAipoyam) May 23, 2025@VijaySethuOfflன் #ACE ஒரு பரபரப்பான ரொமான்டிக் க்ரைம் காமெடி. மலேசியாவில் படமாக்கப்பட்ட இப்படத்தில் விஜய் & @iYogiBabuவின் கெமிஸ்ட்ரி, ஆக்ஷன், காமெடி, ரொமான்ஸ் கலந்து ரசிகர்களை கவர்கிறது. இயக்குனர் @Aaru_Dirன் புதுமையான கதைக்களம் பாராட்டுக்குரியது. #MovieReview #RukminiVasanth pic.twitter.com/V3jNnixC68— Ranjith (@RanjithAnthony) May 23, 2025#AceFirs & foremost the movie did not bore or cringe at any point.The movie just needed better staging & execution, was feeling like watching film that should have come 10 years back(KTv Movies).@VijaySethuOffl & #YogiBabu managed to evoke laughter at intervals,#RukminiVasanth… pic.twitter.com/s4LnPOEGUl— Jiya Rahman (@jiyathedon) May 23, 2025 -
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఏస్ ట్రైలర్ చూస్తే మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తే జూదం, స్మగ్లింగ్, దోపిడీ నేపథ్యంలో కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అభిమానులను అలరించనున్నారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్లో విజయ్ సేతుపతి యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఈ భామ సొగసు చూడతరమా.. వారెవ్వా అనేలా రుక్మిణి వసంత్ ఫొటోస్
-
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
ఒక్క ప్రేమకథ ఈ హీరోయిన్ జీవితాన్నే మార్చేసింది! (ఫొటోలు)
-
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
శివకార్తికేయన్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?
మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటుడు శివకార్తికేయన్. అయితే, తాజాగా విడుదలైన అమరన్ మంచి విజయాన్ని సాధించడంతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 23వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని ఇటీవల ఓ భేటీలో నటుడు శివకార్తికేయన్ తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు. అయితే శివకార్తికేయన్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత హిందీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తాజా సమాచారం. ఆ విధంగా ఇంకా పేరు నిర్ణయించని శివకార్తికేయన్ చిత్రానికి సింగనై అనే టైటిల్ పేరు ప్రచారంలో ఉంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రాన్ని 2025 మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. కాగా ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, సుధా కొంగర దర్శకత్వంలో పురనానూరు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. -
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో హిట్టా.. ఫట్టా
-
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
శ్రీ మురళి హీరోగా డా. సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బఘీర’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు డా. సూరి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల రైటింగ్ విభాగంలో నేనూ ఉన్నాను. శ్రీ మురళిగారితో నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు కథ కుదర్లేదు. అప్పుడు తన దగ్గర కథ ఉందని ప్రశాంత్ నీల్గారు చెప్పడంతో ‘బఘీర’ చిత్రం ప్రారంభమైంది. సూపర్ హీరో అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి ప్రశాంత్ నీల్గారు హ్యాపీ ఫీలయ్యారు. శ్రీ మురళి బాగా నటించారు. ‘బఘీర’ను ‘కేజీఎఫ్’తో ΄ోల్చి మాట్లాడుతున్నారు. ‘బఘీర’ సినిమా ‘కేజీఎఫ్’ టోన్‌లో ఉండదు. ‘కేజీఎఫ్’ చరిత్రలాంటి సినిమా. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం యశ్‌తో ఓ సినిమా చేశాను (‘లక్కీ’). ఆ తర్వాత యశ్‌తో ట్రావెల్ అయ్యాను. యశ్ కథలను నేనే వినేవాడిని. అయితే యశ్‌తో నేను అనుకున్న సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ వల్ల యశ్‌కు చాలా సమయం పట్టింది. దీంతో నేను శ్రీ మురళితో ‘బఘీర’ చేశాను’’ అని తెలి΄ారు. -
మంచు లక్ష్మి కొత్త పాఠాలు.. ఆధ్యాత్మిక బాటలో అషూ
ఫియర్ ప్రమోషన్స్‌లో హీరోయిన్ వేదిక బఘీర ప్రమోషన్స్‌లో రుక్మిణి వసంత్మానసిక ప్రశాంతత ముఖ్యమంటున్న మంచు లక్ష్మిహెబ్బా పటేల్ సెల్ఫీ పోజులు8 జ్యోతిర్లింగాలు సందర్శించిన అషూ రెడ్డిథాయ్లాండ్లో స్నేహ ఉల్లాల్లెవల్ క్రాస్ మూవీ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) ఫోటోలు షేర్ చేసిన అమలాపాల్ View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ?
'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
హీరోయిన్ 'రుక్మిణీ వసంత్' ఇంట్లో విషాదం
‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కన్నడ కస్తూరి రుక్మిణీ వసంత్.. ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఒక సుదీర్ఘమైన లేఖతో ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ చనిపోయినట్లు ఆమె తెలిపారు.ఆగష్టు 23 తెలవారుజామున తన అమ్మమ్మ చనిపోయినట్లు హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెలిపారు. వయసు రిత్యా పలు అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అయితే, తన అమ్మమ్మతో చాలా అనుబంధం ఉన్నట్లు చెప్పిన రుక్మిణీ చాలా ఎమోషనల్ అయింది. తన అమ్మమ్మతో ఉన్న పలు పాత జ్ఞాపకాలను ఆమె పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కన్నడ సినిమాలతో పాపులర్ అయిన రుక్మిణీ వసంత్ తెలుగులో కూడా పలు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంది. విజయ్ దేవరకొండ- రవికిరణ్ కాంబినేషన్లో వుస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్‌గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్‌గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కలర్‌ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్‌తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
పాన్ ఇండియా ఫ్రాంచైజీ సినిమాలో 'రుక్మిణి వసంత్'
'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన బ్యూటీ రుక్మిణి వసంత్.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ఆమెకు టాలీవుడ్లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ పాత్రలో అందర్నీ ఆకర్షించింది. ఇప్పటికే కోలీవుడ్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా నటించేందుకు పలు ప్రాజెక్ట్‌ల స్టోరీలను వింటుంది. తాజాగా ఆమెకు ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాంతార: చాప్టర్ 1 సినిమాలో రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లు ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో హోంబలే ఫిల్మ్స్ సంస్థ వారు చర్చలు కూడా జరిపారట. కాంతార కోసం రిషబ్ సొంత గ్రామం అయిన కెరడిలో ఒక భారీ సెట్‌ను కూడా క్రియేట్ చేశారట. అందులో రుక్మిణికి తాజాగా లుక్ టెస్ట్ కూడా జరిపారట మేకర్స్.. అందులో ఆమె సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్. 'సప్త సాగరాలు దాటి' సినిమా తర్వాత టాలీవుడ్ లో రుక్మిణి పేరు మరింత పాపులర్ అయ్యింది. సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలించారట. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా విషయంలో కూడా రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ఓ వైపు తెలుగులో ఇలా రుక్మిణి పేరు పాపులర్ అవుతుండగానే మరోవైపు కోలీవుడ్ నుంచి ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్షర్ మురుగుదాస్- శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రుక్మిణి వసంత్ ఛాన్స్ పట్టేసింది. కథల ఎంపిక విషయంలో ఆమె చాలా తెలివిగా అడుగులేస్తుందని సమాచారం. View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
సైలెంట్‌గా శివకార్తికేయన్ కొత్త మూవీ షూటింగ్
'మహావీరుడు', 'అయలాన్' సినిమాలతో హిట్స్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో కమలహాసన్ నిర్మిస్తున్న 'అమరన్' ఒకటి. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తీస్తున్న మూవీ షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఎలాంటి ఆర్భాటం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ మూవీ తర్వాత మురగదాస్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) -
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రం షూటింగ్ప్రారంభమైంది. ఈ మూవీలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ కథానాయిక. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియా స్థాయిలో రూపొం దుతోన్న చిత్రమిది. మురుగదాస్‌గారు తన పాపులర్ స్టోరీ టెల్లింగ్ స్టయిల్లో ఈ చిత్రాన్ని రూపొం దించనున్నారు. వరుస బ్లాక్బస్టర్లను అందుకుంటున్న శివకార్తికేయన్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. గత సినిమాల్లో చూసినట్లు కాకుండా ఈ సినిమాలో పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు శివ కార్తికేయన్. ఈ చిత్రం ప్రేక్షకులకు హై యాక్షన్–ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: సుదీప్ ఎలామన్. -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ’. హేమంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ రావడంతో సీక్వెల్‌గా సప్త సాగరాలు దాటి - సైడ్ బి తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై రక్షిత్ శెట్టి తాజాగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. కథేంటంటే..? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. -
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
విజయ్‌కి జోడీగా 'యానిమల్' బ్యూటీ
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోని జోయా పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ముందు శ్రీలీలను తీసుకున్నారు. కొన్ని కారణాలతో శ్రీలీల ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఈ స్థానంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపించింది. తాజాగా త్రిప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఈ ఇద్దర్లో ఎవరు విజయ్ దేవరకొండతో జోడీ కడతారు? లేక మరో హీరోయిన్ ఎవరైనా ఈ అవకాశాన్ని దక్కించుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను మార్చిలోప్రారంభించాలనుకుంటున్నారు. సో.. రెండు నెలల్లో కథానాయిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. -
విజయ్ సేతుపతి క్రేజ్.. మలేషియాలో వేలసంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన 50వ చిత్రం మహరాజాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా తాజాగా తన 51వ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేశారు. 7 సీస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఒరు నల్లనాళ్ పార్తు సొల్రేన్ చిత్రం ఫేమ్ పి.ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌సేతుపతి, ఆర్ముగకుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న రెండవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయకిగా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. నటుడు యోగిబాబు, పీఎస్.అవినాష్, దివ్యాపిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బగత్తూర్ రావత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మలేషియా నేపథ్యంలో సాగే లవ్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం మలేషియాలోనే నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూటింగ్ చేయని కొత్త ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇటీవల విజయ్‌సేతుపతి చైనీస్ స్టంట్ కళాకారులతో పోరాడే భారీ ఫైట్ సన్నివేశాలను, ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకిరించినట్లు చెప్పారు. పత్తుమలై మురుగన్ ఆలయం వద్ద తుది ఘట్ట సన్నివేశాలను రూపొందించినట్లు తెలిపారు. విజయ్ సేతుపతిని చూడడానికి మలేషియాలోని ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారని, వారందరికి విజయ్‌సేతుపతి చిరునవ్వుతో అభివాదం చేసి సంతోషపరిచారని చెప్పారు. షూటింగ్ పూర్తికావడంతో త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: కెప్టెన్ విజయకాంత్ మరణించారంటూ వదంతులు.. వీడియో రిలీజ్ చేసిన నటుడి భార్య -
'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి సైడ్-బి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్ తదితరులు నిర్మాత: పరంవహ పిక్చర్స్ (రక్షిత్ శెట్టి) సమర్పణ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: హేమంత్ ఎమ్ రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి విడుదల తేదీ: నవంబర్ 17, 2023 ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఏ భాష మూవీని అయినా సరే ఆదరిస్తారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా ' సప్త సాగరలు దాటి'. సెప్టెంబర్ లో 'సైడ్- ఏ' పేరుతో తొలి భాగం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని సీక్వెల్‌ను 'సప్త సాగరాలు దాటి సైడ్ - బి' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథేంటి? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. ఎలా ఉంది? 'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చేస్తుంది. లేకపోతే ఇదేం బోరింగ్ సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్.. జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ కాగా.. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివేంజ్ డ్రామాతో సాగే ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను, 10 ఏళ్ల తర్వాత బయటకు రావడంతో సినిమా మొదలవుతుంది. తనకు జైల్లో పరిచయమైన ఓ వ్యక్తి మనుకి ఆశ్రయం ఇస్తాడు. అప్పటికే తన లవర్ ప్రియకి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోవడంతో మను ఆమెని కలవడానికి కూడా ఇష్టపడడు. కానీ ఆమెని మర్చిపోలేడు. దీంతో దూరం నుంచి ఆమెని గమనిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటాయి. అలా ఇంటర్వల్ కార్డ్ పడతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ షురూ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ని చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెడ్తాడు. మరి చివరకు మను - ప్రియ ఒక్కటయ్యారా? లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సప్త సాగారాలు దాటి ఫస్ట్ పార్ట్.. కథ, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పార్ట్ మాత్రం చాలా స్లోగా ఉండి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఎక్కడా ఇంట్రెస్ట్ అనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంప్రెసివ్ గా ఏం లేదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సినిమాలో చిన్న చిన్న డీటైలింగ్ మాత్రం బాగుంది. తనకి డబ్బులు అవసరమై, ఇంతకుముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరకు మను వెళతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. మళ్ళీ వెళ్తే మనుని కుక్కలా ట్రీట్ చేసి, బిస్కెట్ వేసినట్టు ఖరీదైన వాచ్ పడేస్తారు. దీంతో మనుకి కోపం వచ్చి, తనని కుక్కలా ట్రీట్ చేసిన ఓనర్ కొడుకుని కుక్కతో కరిపిస్తాడు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన ప్రభుని ఓ పాడుబడ్డ గోడౌన్ లో బంధించి, తను జైలులో అనుభవించిన దానిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అలానే ఫస్ట్ పార్ట్‌లో ఉన్న విలన్ రెండో భాగంలోనూ ఉంటాడు. సినిమా సముద్రం హోరుతో మొదలై అదే సముద్రం హోరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే.. ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపిస్తారు. ఓవరాల్ గా చెప్పుకుంటే 'సప్త సాగరాలు దాటి సైడ్- బీ'.. ఫస్ట్ పార్ట్ అంత అయితే కనెక్ట్ కాదు. సాగదీత ఎక్కువైంది. ఎవరెలా చేశారు? హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలానే పాత్రలో జీవించాడు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్.. ఇందులో గృహిణిగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. ఇదే సినిమాలో వేశ్యగా, హీరోకి ప్రియురాలు సురభిగా చేసిన చైత్ర జే ఆచర్ కి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై ఎడిటర్ దృష్టి పెట్టుంటే బాగుండేేది. రెండున్నర గంటల సినిమా ఇది. ఓ అరగంట తగ్గించొచ్చు. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
రష్మిక, శ్రీలీలకు పోటీగా మరో కన్నడ బ్యూటీ?
ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ వారం మాత్రం తెలుగు చిత్రాలు ఏం లేవు. 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మిగతా విషయాలు సంగతి కాస్త అలా పక్కనబెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్‌తో తన మార్క్ చూపించింది. మూవీ చూసిన ప్రతిఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఎవరు ఈమె? ఆమె ఫుల్ డీటైల్స్ 'సప్త సాగరాలు దాటి' సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి పేరు రుక్మిణి వసంత్. బెంగళూరులోనే పుట్టి పెరిగింది. లండన్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్.. అశోక చక్ర సొంతం చేసుకున్నారు. ఇకపోతే రుక్మిణి.. 2019లో 'బీర్బల్' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓ మూడేళ్ల ఎక్కడా కనిపించలేదు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఎందుకంత స్పెషల్? ఈ ఏడాది మాత్రం 'భగీర', 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. త్వరలో 'బాణదారియల్లీ' అనే కన్నడ చిత్రంతో థియేటర్లలోకి రాబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈమెకు ఉన్నదల్లా మూడు సినిమాల అనుభవం. కానీ 'సప్త సాగరాలు దాటి' మూవీలో హీరో రక్షిత్ శెట్టిని కొన్ని సీన్స్‌లో డామినేట్ చేసిందంటేనే ఈమె యాక్టింగ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఈమెకి క్లోజప్ షాట్స్ చాలా ఉన్నాయి. ఆయా సన్నివేశాల్లో జస్ట్ కళ్లు, నవ్వుతో అందరినీ మాయ చేసినంత పనిచేసింది. వాళ్లిద్దరికీ పోటీ? ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ల పేరు చెప్పమంటే.. రష్మిక, శ్రీలీల అని అంటారు. వీళ్లిద్దరూ కన్నడలోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. 'సప్త సాగరాలు దాటి'తో రుక్మిణి వసంత్.. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ఒకవేళ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి, హిట్ కొడితే మాత్రం రష్మిక, శ్రీలీలకు పోటీ తప్పకపోవచ్చు! ఇదంతా జరగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు నిర్మాత: రక్షిత్ శెట్టి దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023 మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్‌మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్‌గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్‌తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే. 'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్‌కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్‌లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్‌స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా! ఎవరెలా చేశారు? మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్‌పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్


