కన్నడ నటుడు యశ్ జోరు పెంచాడు.. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారి పోస్టర్స్‌ను విడుదల చేశారు. అయితే, తాజాగా ఇందులో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్ చేశారు.
టాక్సిక్ నుంచి ఇప్పటికే నలుగురు హీరోయన్ల ఫస్ట్‌లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నదియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలతో పాటు తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు. అయితే, తాజాగా మెలిసా పాత్ర కోసం రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.
Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in - A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu
— Yash (@TheNameIsYash) January 6, 2026


