breaking news
Geetu Mohandas
-
'యశ్' బర్త్‌డే స్పెషల్.. 'టాక్సిక్' నుంచి అదిరిపోయే వీడియో
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా యశ్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను పంచుకుంది. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్ నటీనటులు నటించననున్నారు అని యూనిట్ పేర్కొంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన కేజీఎఫ్ చిత్రంతో యశ్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కేజీఎఫ్-2తో ఆయన మార్కెట్ పెరిగింది. ఈ చిత్రాలతో విపరీతమైన పాపులారిటీ దక్కడం వల్ల తన తర్వాతి సినిమా ఏ స్థాయిలో ఉండాలి అనే అంశంలో కాస్త టైమ్ తీసుకున్నాడు. అందుకే 2022 నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో టాక్సిక్ స్టోరీ నచ్చడం ఆపై నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాక్సిక్ షూటింగ్ ప్రారంభమైంది.రిలీజ్ ఎప్పుడు..?టాక్సిక్ సినిమాను వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, తాజాగా రిలీజ్ అయిన వీడియోలో సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో మేకర్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ముగింపు నెల డిసెంబర్ నెలలో టాక్సిక్ విడుదల కావచ్చని తెలుస్తోంది.టాక్సిక్‌లో బాలీవుడ్ బ్యూటీఈ చిత్రంలో కరీనా కపూర్ ( Kareena Kapoor ) ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా..? యశ్‌తో కియారా జోడీ కడతారా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.రామాయణంలో యశ్నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ చిత్రంలో రావణుడిగా యశ్ నటించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా ఉన్నారు. యశ్‌కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి 'రామాయణ' పేరుతో సినిమా రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
యష్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
రాకింగ్ స్టార్ యష్ 19 చిత్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యష్ తన తదుపరి చిత్రం ప్రకటించడంలో చాలా సమయం తీసుకున్నాడు. ఆయనకు భారీగానే ఆఫర్లు వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఫైనల్‌గా తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యశ్.. నువ్వు వెతుకుతున్నదే.. నిన్ను కోరుకుంటుంది' అనే క్యాప్షన్‌ను అక్కడ చేర్చారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రధానంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన కథగా ఉంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఉంది. -
లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)