టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..! | Toxic Director Geetu Mohandas Reacts On His Teaser Comments | Sakshi
Sakshi News home page

Geetu Mohandas: టీజర్‌లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!

Jan 10 2026 11:05 PM | Updated on Jan 11 2026 10:48 AM

Toxic Director Geetu Mohandas Reacts On His Teaser Comments

కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్‌ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒ‍క్క సీన్‌తో టీజర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్‌ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్‌ ఫైరయ్యారు.

తన మూవీ టీజర్‌లోని ఇంటిమేట్‌ సీన్‌పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్‌ ఇలాంటి సీన్స్‌ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్‌ గ్లింప్స్‌లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్‌ సీన్స్ చూపించారు. ఆ సీన్స్‌లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు.  ఈ హాలీవుడ్‌ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్‌ నటించారు. 

కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement