తెలుగు సినిమాలు చేయమని నేనే చెప్పా: రాధికా శరత్‌కుమార్ | Radhika Advises Varalaxmi Sarath Kumar To Act In Telugu Movies, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Radhika : తెలుగులోనే నీకు తగిన పాత్రలు వస్తాయని చెప్పా: రాధికా శరత్‌కుమార్

Mar 3 2026 1:45 AM | Updated on Mar 3 2026 12:14 PM

Radhika Advice to Varalaxmi Sarath Kumar about Movies

తెలుగు సినిమాల్లో నటించమని తానే సలహా ఇచ్చానని సీనియర్ హీరోయిన్ రాధిక అన్నారు. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నామని తెలిపారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సరస్వతి ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. తెలుగు ఆడియన్స్‌ నిన్ను బాగా ఆదరిస్తారని చెప్పానని రాధిక వెల్లడించారు.

రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'తను అద్భుతమైన నటి. ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను. ఇది కొందరికీ తప్పుగా అనిపించొచ్చు. కానీ వరలక్ష్మికి తెలుగు సినిమాలు చేయమని చెప్పా. వాళ్లు నిన్ను చాలా గౌరవిస్తారని చెప్పా. నేను కూడా తెలుగులో చాలా సినిమాలు చేశా. తెలుగు సినిమా నిన్ను గొప్పస్థాయికి తీసుకెళ్తుంది. నీకు తగిన క్యారెక్టర్స్ తెలుగులోనే వస్తాయని తనతో చెప్పానని' అన్నారు. కాగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. వరలక్ష్మీ సోదరి పూజా శరత్‌కుమార్‌ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement