'టాక్సిక్‌' వైలెంట్‌ టీజర్‌ విడుదల | Toxic Official Telugu Teaser Out Now | Sakshi
Sakshi News home page

'టాక్సిక్‌' వైలెంట్‌ టీజర్‌ విడుదల

Feb 20 2026 10:22 AM | Updated on Feb 20 2026 11:28 AM

Toxic Official Telugu Teaser Out Now

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటించిన టాక్సిక్‌ టీజర్‌ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా విడులైన టీజర్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చూపించారు. ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యష్‌  నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement