భారీ మోసం కేసులో ప్రముఖ దర్శకుడు, సతీమణికి బెయిల్‌ | Supreme Court grants bail to Vikram Bhatt and Shwetambari Bhatt | Sakshi
Sakshi News home page

భారీ మోసం కేసులో ప్రముఖ దర్శకుడు, సతీమణికి బెయిల్‌

Feb 20 2026 7:12 AM | Updated on Feb 20 2026 7:15 AM

Supreme Court grants bail to Vikram Bhatt and Shwetambari Bhatt

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌లకు బెయిల్‌ లభించింది. రూ. 30 కోట్ల రూపాయల మోసం చేశారని వారిద్దరిపై ఇందిరా ఐవిఎఫ్ వ్యవస్థాపకుడు అజయ్ ముర్దియా  ఉదయ్‌పూర్‌లో కేసు నమోదు చేశాడు. దీంతో వారిని గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక బయోపిక్ కోసం తన వద్ద డబ్బు తీసుకుని, నకిలీ బిల్లులతో మోసం చేశారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో మొదట శ్వేతాంబరికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన  విషయం తెలిసిందే. 

ఈ క్రమంలోనే విక్రమ్‌ భట్‌కు కూడా బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. డాక్టర్‌ అజయ్‌ ముర్దియా తన దివంగత భార్య జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్‌ తీస్తామని చెప్పి తన వద్ద డబ్బు తీసుకున్నట్లు తెలిపారు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని భారీగా డబ్బులు వస్తాయని తనను  నమ్మించినట్లు చెప్పారు. వారి మాటలు నమ్మి భట్‌ దంపతులకు రూ.30కోట్లు  ఇచ్చానని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement