మిరాకిల్‌లో... | Hebah Patel on boarded for Prabhas Nimmala MIRACLE | Sakshi
Sakshi News home page

మిరాకిల్‌లో...

Feb 20 2026 3:56 AM | Updated on Feb 20 2026 3:56 AM

Hebah Patel on boarded for Prabhas Nimmala MIRACLE

రణధీర్‌ భీసు హీరోగా, హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మిరాకిల్‌’. ఆమని, శ్రీరామ్, సురేష్‌ కీలక పాత్రలుపోషిస్తున్నారు. ‘సత్య గ్యాంగ్, ఫైటర్‌ శివ’ చిత్రాల ఫేమ్‌ ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో రమేష్‌ ఎగ్గిడి, శ్రీకాంత్‌ మొగదాసు, చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభ కానున్న మూడో షెడ్యూల్‌లో హెబ్బా పటేల్‌ పాల్గొననున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘మిరాకిల్‌’. హెబ్బా పటేల్‌ గ్లామర్, సీనియర్‌ హీరోలు శ్రీరామ్, సురేష్‌ పాత్రలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్‌ బ్లాక్స్‌ ప్రధాన ఆకర్షణ కానున్నాయి’’ అని తెలిపారు. నాయుడు పెండ్ర, ధీరజ అప్పాజీ, దిల్‌ రమేష్, ఝాన్సీ ముఖ్య పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సురేందర్‌ రెడ్డి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement