బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ టైటిల్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా (హిందీ, మరాఠీ) చిత్రం ‘రాజా శివాజీ’. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందు తున్న సినిమా ఇది. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ , మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంస్థల సమర్పణలో జ్యోతీ దేశ్‌పాండే, జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 1న రిలీజ్ కానుంది.
ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ‘రాజా శివాజీ’ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మన రాజు మన గర్వం... మన వారసత్వం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఈ సినిమాపోస్టర్‌ను షేర్ చేశారు రితేష్. హిందీ, మరాఠీ భాషలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.


