'రాణి ఎప్పటికీ రాణినే'.. నమ్రతపై వారణాసి బ్యూటీ ప్రశంసలు..! | Varanasi actress Priyanka Chopra hails queen Namrata Shirodkar | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: 'మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్'.. ఏ ప్లేస్‌లో నిలిచిందంటే?

Feb 19 2026 6:24 PM | Updated on Feb 19 2026 6:41 PM

Varanasi actress Priyanka Chopra hails queen Namrata Shirodkar

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌పై వారణాసి హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. రాణి ఎప్పటికీ రాణినే ఉంటూ ఓ వీడియోను షేర్ చేసింది. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియోను పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు మహేష్ బాబును కూడా ట్యాగ్ చేసింది.

కాగా.. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్‌ మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నమ్రతా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే ఏడాది నమ్రతా ప్రపంచ అందాల పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని టాప్‌-6లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. కాగా.. ఆ తర్వాత మిస్ వరల్డ్ -2000 పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఏకంగా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

నమ్రతా సినీ కెరీర్

నమ్రతా తొలిసారిగా 1977లో శత్రుఘ్న సిన్హా నటించిన షిర్డీ కే సాయి బాబా చిత్రంలో నటించింది. 1998లో  మేరే దో అన్మోల్ రతన్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నమ్రతా..  2000 ఏడాదిలో వంశీ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలను నమ్రతా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement