థ్రిల్లర్‌ సిరీస్‌లో సముద్రఖని.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Samuthirakani Starrer Thadayam Web Series OTT Release Date out | Sakshi
Sakshi News home page

తొలిసారి ఓటీటీ సిరీస్‌లో సముద్రఖని.. వచ్చే వారమే రిలీజ్‌

Feb 19 2026 4:28 PM | Updated on Feb 19 2026 4:49 PM

Samuthirakani Starrer Thadayam Web Series OTT Release Date out

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్‌సిరీస్‌లో బాగమయ్యాడు. ఆ సిరీస్‌ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.

ట్రైలర్‌ రిలీజ్‌
తాజాగా ట్రైలర్‌ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్‌ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌ఐ అదియమాన్‌గా సముద్రఖనిని చూపించారు.

ఓటీటీలో తడయం
ఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్‌ చంద్ర వాయిస్‌తో డైలాగ్‌ వచ్చింది. మరి ఈ సిరీస్‌లో నవీన్‌ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించినట్లు మేకర్స్‌ తెలిపారు. నవీన్‌ కుమార్‌ పలనివేల్‌ దర్శకత్వం వహించిన ఈ  సిరీస్‌కు విబిన్‌ భాస్కర్‌ సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement