మెగా మేనేజర్‌ కుమారుడు.. హీరోగా ఎంట్రీ | Ram Charan's Manager Son To Enter In MAD Movie Sequel | Sakshi
Sakshi News home page

మెగా మేనేజర్‌ కుమారుడు.. హీరోగా ఎంట్రీ

Feb 19 2026 1:08 PM | Updated on Feb 19 2026 1:16 PM

Ram Charan's Manager Son To Enter In MAD Movie Sequel

‘మ్యాడ్‌’ (Mad) ప్రాంఛైజ్‌ నుంచి పార్ట్‌-3 మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోకి హీరోగా రామ్‌ చరణ్‌ మేనేజర్‌ కుమారుడు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు నటించిన మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్‌-3 రానుంది. అందులో కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు.  ఇప్పటికే సినిమా షూటింగ్‌ కూడా మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌ను కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ్యాడ్‌ క్యూబ్‌లోకి  రామ్ చరణ్ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమారుడు దృషిక్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంపాటు చరణ్‌కు ఆయన మేనేజర్‌గా ఉ‍న్నారు. రామ్ చరణ్ సినిమాల వ్యవహారాలతో పాటు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రవీణ్ నే చూసుకుంటారు. సినిమా బ్యాగ్రౌండ్‌లో ఉండటంతో ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్నాడు. సినిమా పరిశ్రమలోకి వచ్చేందుకు దృషిక్ కూడా ట్రైనింగ్‌ అయ్యాడు. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు  లండన్ వెళ్లి నేర్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. సరైన టాలెంట్‌ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement