ఓటీటీలో బోల్డ్ అండ్ ఫ‌న్ మూవీ స్ట్రీమింగ్‌ | Tu Meri Main Tera Main Tera Tu Meri Now Streaming OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో బోల్డ్ అండ్ ఫ‌న్ మూవీ స్ట్రీమింగ్‌

Feb 19 2026 10:49 AM | Updated on Feb 19 2026 11:26 AM

Tu Meri Main Tera Main Tera Tu Meri Now Streaming OTT

బోల్డ్ అండ్ ఫ‌న్ కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో విడుదలైన మూవీ  ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ (Tu Meri Main Tera Main Tera Tu Meri).. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ఇక నుంచి ఉచితంగానే ఊడొచ్చు. తాజాగా రెంటల్‌ విధానాన్ని తొలగించారు. డిసెంబర్ 25, 2025న విడుదలైన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు.  ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions), నమః పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాపై కొంతమేరకు పాజిటీవ్‌ రివ్యూలు వచ్చినప్పటికీ ధురంధర్‌ మూవీతో పోటీపడలేక బాక్సాఫీస్‌ వద్ద నష్టాలను మిగిల్చింది.

‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ అమెజాన్‌ ‍ప్రైమ్‌లో ( Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతుంది.  ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ మెత్తాన్ని తాజాగా రద్దు చేశారు. ఇక నుంచి ఈ మూవీని ఉచితంగానే ఓటీటీలో చూడొచ్చని పేర్కొంది. ‘పతి పత్ని ఔర్ వోహ్’ (Pati Patni Aur Woh) తర్వాత కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కలిసి ఈ మూవీలో నటించారు. దీంతో దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 40 కోట్ల మేరకే రాబట్టినట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement