'సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేశా'.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ స్రవంతి | Bigg Boss Fame Sravanthi Opens Up About Her Early Career Struggles | Sakshi
Sakshi News home page

Sravanthi: 'గంటల పాటు నిలబడే ఉండాలి.. చాలా ఇబ్బంది పడ్డా'.. స్రవంతి ఎమోషనల్

Feb 19 2026 10:06 PM | Updated on Feb 20 2026 9:36 AM

Bigg Boss Fame Sravanthi Career Struggles at Intial Days

సుహాస్‌ హీరోగా నటిస్తున్న హే బల్వంత్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి. ఈ మూవీలో  కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్రవంతి తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులు పంచుకుంది. ఒకానొక సమయంలో డైమండ్‌ జ్యూవెలరీ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా కూడా ఉద్యోగం చేశానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ జాబ్‌ చేసేటప్పుడు గంటలకొద్ది నిలబడే ఉండాలని తెలిపింది. ఆ సమయంలో నిలబడలేక చాలా ఇబ్బంది పడ్డానని బోరున ఏడ్చేసింది. అయితే ఈ ఉ‍ద్యోగం నా ఇష్టంతోనే చేశానని.. నా జీతం కంటే ఇన్‌సెంటివ్స్‌ ఎక్కువగా వచ్చేదని వెల్లడించింది.

ఇటీవల ఎక్కువగా సినిమా ప్రమోషన్స్‌లో పైకి నవ్వుతూ కనిపించే స్రవంతి.. తన కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొని ప్రస్తుతం టాలీవుడ్‌లో రాణిస్తోంది. అభిరామ్ అనే వ్యక్తి తాను ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది. స్రవంతి చొక్కారపు స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. 2009లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నటి అవడానికి చాలా టైమ్ పట్టింది.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement