హెబ్బా పటేల్‌ హారర్‌ మూవీ.. ఇక్కడ కూడా స్ట్రీమింగ్‌ | Esha movie Now streaming india | Sakshi
Sakshi News home page

హారర్‌ మూవీ 'ఈషా'.. ఇక్కడ కూడా స్ట్రీమింగ్‌

Feb 20 2026 10:08 AM | Updated on Feb 20 2026 11:03 AM

Esha movie Now streaming india

త్రిగుణ్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో నటించిన హారర్‌  థ్రిల్లర్‌ ‘ఈషా’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఇతర దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు భారత్‌లో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది. దర్శకుడు  శ్రీనివాస్‌ మన్నె  తెరకెక్కించిన ఈ మూవీని కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ సమర్పణలో పి హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. గతేడాది డిసెంబరు 12న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్స్‌ రాబట్టింది.  ఇందులో త్రిగుణ్, హెబ్బా పటేల్‌తో పాటు అఖిల్‌ రాజ్, సిరి హనుమంతు కూడా నటించారు.

‘ఈషా’ మూవీ తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేశారు. లిటిల్‌ హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి సినిమాల తర్వాత  ‘ఈషా’ అనే హారర్‌ చిత్రాన్ని బాక్సాఫీస్‌ ముందుకు తీసుకు రావడంతో బజ్‌ క్రియేట్‌ అయింది. నేటి సమాజంలో దెయ్యాలు, ఆత్మలనేవి ఉన్నాయని నమ్మే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. లేవని చెప్పే వాళ్లూ అంతేమంది ఉన్నారు. ఇదే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు.

కథేంటి?
కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement