ఈ నెల ప్రారంభంలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'కాంతార 1'. ఇదొచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రాలేదు. దీంతో పలు భాషల్లో ఇప్పటికీ బాగానే ప్రదర్శితమవుతోంది. రెండు మూడు రోజుల క్రితం రూ.800 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రూ.1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీ గురించి అప్‌డేట్ వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)
2022లో రిలీజైన మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా.. ఈ సినిమా కూడా దీనిలోనే రానుందని సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 'లెజెండ్ కంటిన్యూస్' అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిబట్టి చూస్తే 'కాంతార ఛాప్టర్ 1' కూడా వేగంగానే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. అభిమానులు మాత్రం థియేటర్లలో ఉండగానే వచ్చేయడమేంటి? ఇంకొన్నిరోజులు ఆగి వస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ వీకెండ్‌లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని.. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుందో?
(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)
'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.
కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ లిస్ట్)
...to become LEGENDARY 🔥 pic.twitter.com/xRh6zFJkS1
— prime video IN (@PrimeVideoIN) October 26, 2025


