బాక్సాఫీస్ వద్ద దురంధర్‌.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..! | Dhurandhar creates Massive record at Boxoffice Beats Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

Dhurandhar Record: రణ్‌వీర్‌ సింగ్ దురంధర్‌.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!

Dec 14 2025 7:13 AM | Updated on Dec 14 2025 7:30 AM

Dhurandhar creates Massive record at Boxoffice Beats Pushpa 2 Movie

డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్‌ మూవీ  దురంధర్‌. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్‌ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే మొదటి వారం కలెక్షన్స్‌ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్‌ లాంటి బిగ్ హిట్స్‌ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.

ఈ లిస్ట్‌లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్  రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్‌వీర్‌ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.

కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్‌ దత్, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్‌ బేడీ, సౌమ్య టాండన్‌  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్‌ ఏజెంట్‌గా రణ్‌వీర్‌ సింగ్‌.. ఐబీ చీఫ్‌గా మాధవన్‌ నటించారు. విలన్‌గా అక్షయ్‌ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement