స్మిత పాడిన "మసక మసక చీకటిలో" పాట ఆమె కెరీర్‌లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సాంగ్‌గా గుర్తింపు పొందింది. - దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్‌కు నచ్చేలా అదే సాంగ్‌కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. "మసక మసక చీకటిలో" పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. పాత పాటకు కొత్త రీమిక్స్ రూపం ఇచ్చి, యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికీ ఆమె సిగ్నేచర్ హిట్‌గా గుర్తించబడుతోంది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


