శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా ట్రైలర్‌ | Gurram Paapi Reddy Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా ట్రైలర్‌

Dec 13 2025 6:14 PM | Updated on Dec 13 2025 6:31 PM

Gurram Paapi Reddy Movie Trailer Out Now

గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. డార్క్‌ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్‌ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశంగా ఈ మూవీ ఉండనుంది.  బ్రహ్మానందం జడ్జ్‌ పాత్రలో ఫుల్‌‌ లెంగ్త్‌ రోల్‌ నటించారు. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement