పాప్ సింగర్ స్మిత ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ 2000ల్లో మాత్రం 'మసక మసక చీకటిలో..' అనే ఆల్బమ్ సాంగ్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు ఆల్బమ్ గీతాలు చేసింది. కాకపోతే రీసెంట్ టైంలో మాత్రం పెద్దగా బయట కనిపించట్లేదు. తాజాగా 'మసక మసక' అని సాగే కొత్త పాటతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. హైదరాబాద్‌లో ఈ సాంగ్ లాంచ్.. శనివారం సాయంత్రం జరిగింది.
(ఇదీ చదవండి: కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్)
ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మిత.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేశానో మరోసారి చెప్పుకొచ్చింది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. 'గాయనిగా నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో ఓ పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మనకు చెప్పేది ఒకటి అక్కడ ఉండేది ఒకటి. ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను' అని స్మిత చెప్పుకొచ్చింది.
స్మిత సింగర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ నటి, యాంకర్, బిజినెస్‌ఉమన్ గానూ పేరు తెచ్చుకుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతానికైతే మళ్లీ సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చే బిజిలో ఉంది. ఈ సాంగ్ ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)


