హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.
'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్‌గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.


