‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ "మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’.
సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి.
ఇటీవల విడుదల అయినా 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు మరియు టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి" అని తెలిపారు.


