breaking news
Bad Girls Movie
-
‘బ్యాడ్ గాళ్స్’ లాంటి సినిమాలు తప్పక ఆడాలి: మారుతి
‘‘సినిమా టైటిల్ మాత్రమే ‘బ్యాడ్ గాళ్స్’. కానీ, మూవీ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నేటితరం అమ్మాయిలు ఎలా ఉన్నారు? వాళ్ల ఆలోచనా విధానం ఏంటి? వాళ్లు ఏమి కోరుకుంటున్నారు? వంటి మంచి కాన్సెప్ట్‌తో, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిన ‘బ్యాడ్ గాళ్స్’తప్పక ఆడాలి’’ అని డైరెక్టర్ మారుతి ఆకాంక్షించారు. ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మోయిన్, రోహన్ సూర్య ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ఫణి ప్రదీప్ ధూళిపూడి(మున్నా) దర్శకత్వం వహించారు. ప్రశ్విత ఎంటర్టైన్ మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్ ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా నెల 25న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మారుతి విడుదల చేసి, ‘‘ఫణి ప్రదీప్ నాకు మిత్రుడు. ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. -
‘బ్యాడ్ గాళ్స్’ వచ్చేస్తున్నారు
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ "మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇటీవల విడుదల అయినా 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు మరియు టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి" అని తెలిపారు. -
బ్యాడ్ గర్ల్స్ మూవీ.. చంద్రబోస్ రాసిన ఫుల్ వీడియో సాంగ్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. బ్యాడ్ గర్ల్స్ ఆంథమ్ పేరుతో ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..వాగ్దేవి ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశానని డైరెక్టర్ మున్నా గతంలో చెప్పారు. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలనదే కాన్సెప్ట్ అని అన్నారు. -
టీజర్ చూసి అశ్లీల చిత్రం అనుకున్నారు: డైరెక్టర్
కోలీవుడ్‌లో తెరకెక్కిన 'బ్యాడ్ గర్ల్'(BadGirl Movie) చిత్రం పలు వివాదాలు ఎదుర్కొని సెప్టెంబర్ 5న విడుదలైంది. వర్షా భరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత పాన్ ఇండియా రేంజ్లో అభ్యంతరాలు రావడంతో అతికష్టం మీద కొన్ని మార్పులు చేసి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే, తాజాగా దర్శకురాలు వర్షా భరత్ మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారని, ఇదేం అశ్లీల చిత్రం కాదని పేర్కొన్నారు.బ్యాడ్ గర్ల్ మూవీలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా.. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. గతంలో వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వర్షా భరత్ తొలిసారిగా ఈ మూవీని దర్శకురాలిగా తెరకెక్కించారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. బ్యాడ్ గర్ల్ టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్‌లో ప్రదర్శించామన్నారు. అయితే, అక్కడ తమకు ఊహించలేనంతగా ప్రశంసలు వచ్చాయన్నారు. ఆపై ఈ చిత్రం అవార్డును కూడా సొంతం చేసుకుందని గుర్తుచేసుకున్నారు. కానీ, మనవాళ్లందరూ మాత్రం నేనోక చెత్త సినిమా తీశానన్నారు. కనీసం పెద్దలు కూడా చూడలేనంతగా అశ్లీల చిత్రాన్ని తెరకెక్కించానని విమర్శించారు. కానీ, అంతర్జాతీయ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. టీజర్ తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సెన్సార్ సూచన మేరకు కొన్ని సీన్లు కట్ చేసి తమిళ్లో విడుదల చేశాం. అక్కడ వచ్చిన రివ్యూలు చూసి మనసు కుదుటపడింది. ఆ సమయంలో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. కొద్దిరోజుల తర్వాత మా కుటుంబసభ్యులను తీసుకొని థియేటర్‌కు వెళ్లాను. సినిమా పూర్తి అయ్యాక వాళ్లు నన్ను విమర్శించలేదు. అప్పుడు అర్థమైంది. సినిమా బాగుంది అనిపించింది. కానీ ప్రజల ఆలోచన తీరు ఆ సమయంలోనే నాకు అర్థమైంది’’ అని వర్షా (Varsha Bharath) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ మూవీని నిర్మించిన వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌పైనా చాలామంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా సినిమాను విడుదల చేయకండి అంటూ నినాదాలు చేశారు. దీంతో సెన్సార్ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. -
‘నీలి నీలి ఆకాశం’ సీక్వెల్ సాంగ్ వచ్చేసింది
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకి సీక్వెల్ 'ఇలా చూసుకుంటానే' రిలీజ్ అయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ కోసం ఈ పాటని కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు అనూబ్ రూబెన్స్. ఆస్కార్ విన్నర్, లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.పాట రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ "ఈరోజు మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో మొదటి పాట 'ఇలా చూసుకుంటానే' ను రానా దగ్గుబాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మెలోడీ పాట. 'నీలి నీలి ఆకాశం' పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్ మరియు మలేషియా ప్రకృతి అందాలలో చిత్రీకరించాము. అనూప్ రూబెన్స్ అద్భుతమైన భాణీ అందిస్తే సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు.‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోద భరిత చిత్రం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. -
‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్.. బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించిన దర్శకుడు!
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాటే సినిమాపై బజ్‌ని క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఆ పాటకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా కోసమే ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్‌ని రెడీ చేశాడు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. 'ఇలా చూసుకుంటానే' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఈ ప్రీ టీజర్ లో చంద్ర బోస్ గారు కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశారు . త్వరలోనే ఈ పాట విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మున్నా ధూళిపూడి మాట్లాడుతూ ఇప్పుడు 'ఇలా చూసుకుంటానే' అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’" అని తెలిపారు. -
రేణూ దేశాయ్ కీలక పాత్రలో ‘బ్యాడ్ గాళ్స్’.. అమ్మోరులా అమ్మాయిలు!
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రధారులు. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ – ‘‘బ్యాడ్ గాళ్స్’లోని నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ మూవీ పెద్ద హిట్టవ్వాలి’’ అని కోరారు. ‘‘నా మిత్రుడు మున్నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా చేయడం సాహసమే’’ అని శివ నిర్వాణ చెప్పారు. ‘‘అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలి’’ అని మున్నా చెప్పారు. ‘‘కుటుంబంతో సహా ప్రేక్షకులు మా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.


