‘‘సినిమా టైటిల్ మాత్రమే ‘బ్యాడ్ గాళ్స్’. కానీ, మూవీ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నేటితరం అమ్మాయిలు ఎలా ఉన్నారు? వాళ్ల ఆలోచనా విధానం ఏంటి? వాళ్లు ఏమి కోరుకుంటున్నారు? వంటి మంచి కాన్సెప్ట్‌తో, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిన ‘బ్యాడ్ గాళ్స్’తప్పక ఆడాలి’’ అని డైరెక్టర్ మారుతి ఆకాంక్షించారు. ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మోయిన్, రోహన్ సూర్య ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ఫణి ప్రదీప్ ధూళిపూడి(మున్నా) దర్శకత్వం వహించారు.
ప్రశ్విత ఎంటర్‌టైన్ మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్ ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా నెల 25న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మారుతి విడుదల చేసి, ‘‘ఫణి ప్రదీప్ నాకు మిత్రుడు. ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు.


