
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకి సీక్వెల్ 'ఇలా చూసుకుంటానే' రిలీజ్ అయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ కోసం ఈ పాటని కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు అనూబ్ రూబెన్స్. ఆస్కార్ విన్నర్, లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.
పాట రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ "ఈరోజు మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో మొదటి పాట 'ఇలా చూసుకుంటానే' ను రానా దగ్గుబాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మెలోడీ పాట. 'నీలి నీలి ఆకాశం' పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్ మరియు మలేషియా ప్రకృతి అందాలలో చిత్రీకరించాము. అనూప్ రూబెన్స్ అద్భుతమైన భాణీ అందిస్తే సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు.
‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోద భరిత చిత్రం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.