30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్‌టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. బ్యాడ్ గర్ల్స్ ఆంథమ్ పేరుతో ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..వాగ్దేవి ఆలపించారు. ఈ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశానని డైరెక్టర్ మున్నా గతంలో చెప్పారు. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలనదే కాన్సెప్ట్ అని అన్నారు.


