ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కోర్ట్ మూవీ టీమ్ కలిశారు. బన్నీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఐకాన్ స్టార్తో ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
కోర్ట్ కథేంటంటే..
కాగా.. మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్గా ప్రియదర్శి నటించారు. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ మూవీని హీరో నాని నిర్మించారు. రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.
What an Ikonic moment…@alluarjun Anna ❤️🙏🫂#Court pic.twitter.com/eBMCtTyEsQ
— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 11, 2025


