సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పడంపై మౌగ్లీ నటుడు బండి సరోజ్ కుమార్ స్పందించారు. ఈ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీగా డబ్బులు ఖర్చు చేయడం నా కళ్లారా చూశానని అన్నారు. ఈ సినిమాను నా బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ఈ చిత్రానికి ఆటంకం కలగకూడదనే సెన్సార్ బోర్డ్‌కు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ నేరవేర్చానని అన్నారు. నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా బయటికొచ్చి ప్రమోషన్స్ చేశానని అన్నారు. మీరు సినిమా చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి ఆడియన్స్కు సూచించారు. కాగా.. మౌగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
బండి సరోజ్ ఏమన్నారంటే..
బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు చెబుతూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
#Mowgli సినిమా ని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాత నా కళ్ళ ముందే డబ్బును భారీగా ఖర్చుపెట్టడం చూసాను. దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా introvert behaviour నుండీ బయటకు వచ్చి ఆల్ ఔట్ ప్రమోషన్ చేశాను. Censor board వాళ్లు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ ను సినిమాకు…
— Saroj (@publicstar_bsk) December 11, 2025


