హైదరాబాద్‌ టు ఢిల్లీ | Ram Charan Peddi new shooting schedule in Delhi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు ఢిల్లీ

Dec 12 2025 3:39 AM | Updated on Dec 12 2025 3:39 AM

Ram Charan Peddi new shooting schedule in Delhi

చిన్న బ్రేక్‌ తర్వాత పెద్ది’ సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఓ లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ తర్వాత ‘పెద్ది’ టీమ్‌ చిన్న బ్రేక్‌ తీసుకుంది. కొత్త షెడ్యూల్‌ మళ్లీ హైదరాబాద్‌లోనేప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్‌ ప్లాన్‌ చేసింది.

జనవరి నెలాఖరు వరకు ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయ్యేలా టీమ్‌ ప్లాన్‌ చేసింది. ‘‘పెద్ది’ షూటింగ్‌ అంతా ప్లాన్‌ ప్రకారమే జరుగుతోంది. నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. మరోవైపు పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement