అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి | Malayalam Actress Lena about not having Kids, Reason is | Sakshi
Sakshi News home page

నా చిన్నతనంలో అవన్నీ చూశా.. అందుకే సంతానం వద్దనుకున్నా

Feb 4 2026 1:00 PM | Updated on Feb 4 2026 1:08 PM

Malayalam Actress Lena about not having Kids, Reason is

ఓ వయసుకు రాగానే పెళ్లి చేసుకోవం, పిల్లల్ని కనడం అనేది ఒక రూల్‌లా అయిపోయింది. కానీ, పెళ్లయ్యాక తప్పకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదంటోంది మలయాళ నటి లీనా. బాధ్యతగా ఉంటామనుకుంటే తప్ప పిల్లల జోలికి వెళ్లకూడదని చెప్తోంది. లీనా మాట్లాడుతూ.. సంతానం వద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్లను ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అన్న ప్లానింగ్‌ ఉండాలి. 

బాధ్యత అవసరం
తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. పెళ్లవగానే పిల్లల్ని కనాలంటారు. దానికి నేను వ్యతిరేకం. చిన్న వయసులోనే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిడ్న్‌ను హ్యాండిల్‌ చేసే మెచ్యూరిటీ కూడా ఆ వయసులో ఉండదు. నా చిన్నప్పుడు పేరెంట్స్‌ నన్ను సరిగా పెంచలేదని అనుకుంటూ ఉండేదాన్ని. నాపై ఇంకాస్త ఫోకస్‌ చేయాల్సిందని ఫీలయ్యేదాన్ని. కొన్నిసార్లు స్వేచ్ఛ కోసం పోరాడేదాన్ని. 

సంతానం వద్దనుకున్నా..
మరికొన్నిసార్లు నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారని కోప్పడేదాన్ని. ఒక్కోసారేమో నాకు ఎవరూ సపోర్ట్‌ చేయలేడం లేదు, ప్రతిసారి ఒంటరిగా వదిలేస్తున్నారని బాధపడేదాన్ని. ఇలా ఎప్పుడూ ఏదో ఒకరకమైన విచారంలో బతికేదాన్ని. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. పైగా నేను ఎంచుకుంది యాక్టింగ్‌ కెరీర్‌. 

కెరీర్‌
ఇక్కడ కుటుంబం, కెరీర్‌.. రెండూ చూసుకోవడం అంటే కష్టం. తల్లిదండ్రులిద్దరూ కెరీర్‌ అని పరుగులు పెడితే పిల్లల్నెవరు చూసుకుంటారు. అందుకే పిల్లల్ని ప్లాన్‌ చేయలేదు అని చెప్తోంది. మలయాళంలో అనేక సినిమాలు చేసిన లీనా తెలుగులో డాక్టర్‌ చక్రవర్తి మూవీలో కనిపించింది. షైతాన్‌ అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లోనూ అలరించింది. కాగా లీనా 2004లో అభిలాష్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గగన్‌యాన్‌ వ్యోమగామి ప్రశాంత్‌ నాయర్‌ను వివాహం చేసుకుంది.

చదవండి: అందువల్లే 4 ఏళ్లు సినిమాలకు బ్రేక్‌: మాధవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement