ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాదికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. హిందీ చిత్రం ‘సైయారా’ తొలి స్థానంలో నిలిచింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్‌లో నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక రెండో స్థానంలో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’, మూడో స్థానంలో విక్కీ కౌశల్ ‘ఛావా’, నాలుగో స్థానంలో రిషబ్ శెట్టి ‘కాంతారా: చాప్టర్ 1’ చిత్రాలు నిలిచాయి.
రజనీకాంత్ ‘కూలీ’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’, షాహిద్ కపూర్ ‘దేవా’, అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’, కల్యాణీ ప్రియదర్శన్ ‘లోక చాప్టర్1: చంద్ర’ చిత్రాలు వరుసగా 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అలాగే ఐఎండీబీ పోర్టల్ టాప్‌టెన్ వెబ్ సిరీస్ జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’కి తొమ్మిదో స్థానం దక్కింది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ తొలి స్థానంలో నిలిచింది.


