పవన్ కళ్యాణ్ బత్తులను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ పురుష. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, క్యాప్షన్స్ చూస్తుంటే ఫుల్గా నవ్వించే కథతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం అంటూ పోస్టర్పై రాసిన క్యాప్షన్ ఫుల్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్ర్లలో నటించారు.


