చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులను మళ్లీ వస్తే బాగుండని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. బాల్యం, స్కూల్ లైఫ్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకోని వారు ఉండరేమో. అంతటి మధురమైన చిన్ననాటి చిలిపి పనులు తలచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. బాల్యం నాటి మన ఫోటోలు చూస్తే మనమేనా అన్న డౌట్ వచ్చేస్తుంది. అలాంటి అరుదైన ఫోటోలు దొరికితే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.
అలాంటి మధురమైన జ్ఞాపకాలను టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ పోస్ట్ చేసింది. చిన్నప్పుడు అక్క మంగ్లీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ రోజులను గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇది చూసిన అభిమానులు వావ్ బ్యూటీఫుల్.. నేచురల్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ.. అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ అయింది. మంగ్లీతో పాటే సిస్టర్ ఇంద్రావతి చౌహన్ జానపద గాయని కావడం విశేషం. ఇద్దరు సిస్టర్స్ సింగర్స్‌గా తెలుగు వారిని తమ అలరిస్తూనే ఉన్నారు.


