చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం మొదలైందంటే చాలు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల సందడే సందడి. ఇక ఈ వారంలో బిగ్ స్క్రీన్పై అలరించేందుకు అఖండ-2, మౌగ్లీ చిత్రాలు వచ్చేస్తున్నాయి. గత వారమే రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్ చేయడం లేదు. కేవలం మౌగ్లీ మాత్రమే అఖండతో పోటీ పడనుంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ కాంత మాత్రమే ఈ ఫ్రైడే కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇది మినహాయిస్తే తెలుగులో 3 రోజేస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏ నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12
సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12
జియో హాట్‌స్టార్
అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్
టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
ఆహా
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12
జీ5
సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12
సన్ నెక్స్ట్
అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12
ఆపిల్ టీవీ ప్లస్
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12
మనోరమ మ్యాక్స్
ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12


