‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్‌.. బ్లాక్‌ మెయిల్‌ చేసి ఒప్పించిన దర్శకుడు! | Neeli Neeli Aakasam Song Sequel Announcement | Sakshi
Sakshi News home page

‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్‌.. బ్లాక్‌ మెయిల్‌ చేసి ఒప్పించిన దర్శకుడు!

Aug 20 2025 12:04 PM | Updated on Aug 20 2025 12:11 PM

Neeli Neeli Aakasam Song Sequel Announcement

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాటే సినిమాపై బజ్‌ని క్రియేట్‌ చేసింది. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఆ పాటకు ఇప్పుడు సీక్వెల్‌ రాబోతుంది.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా కోసమే  ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్‌ని రెడీ చేశాడు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్.  మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ పాటని సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. 'ఇలా చూసుకుంటానే' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఈ ప్రీ టీజర్ లో చంద్ర బోస్ గారు కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశారు . త్వరలోనే ఈ పాట విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ మున్నా ధూళిపూడి మాట్లాడుతూ ఇప్పుడు  'ఇలా చూసుకుంటానే' అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’" అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement